Thursday, March 5, 2026

తుమ్మలూరు గ్రామంలో ప్రారంభానికి సిద్ధమవుతున్న అంబేద్కర్ విగ్రహం

నేటి సాక్షి 19ఫిబ్రవరి కృష్ణారావు పేట:– అంబేద్కర్ విగ్రహానికి తుదిమెరుగులు భారత రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదుడు సామాజిక సంఘసంస్కర్త దళితుల హక్కుల సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతిగా పోరాడి మనువాద సిద్ధాంతాన్ని తరిమికొట్టి అంటరానితనాన్ని రూపుమాపిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పూనం ప్రతిష్టకు మరియు ప్రారంభానికి సిద్ధమవుతుంది వివరాల్లోకెళ్తే మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామంలో ఆదర్శ యువజన సంఘం మరియు గ్రామ సర్పంచ్ వి ప్రసాద్ ఆధ్వర్యంలో పనులు చక చక వేగంగా జరుగుతున్నాయి గతంలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండేదని అయితే ఎన్ హెచ్ 340c నేషనల్ హైవే పోవడంతో విగ్రహం తొలగించారని ఇప్పుడు మరల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి తొందరలోనే విగ్రహాన్ని ప్రారంభం కానుందని తెలుస్తోంది అన్ని పరిస్థితులు అనుకూలిస్తే దాదాపు 15 రోజుల తర్వాత ఉండే అవకాశం ఉంది ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభానికి సిద్ధమవుతుండడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా మరల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం తుమ్మలూరు గ్రామంలో పునం ప్రతిష్టించి ప్రారంభించడానికి సిద్ధంగా ఉండడం విశేషంగా చెప్పవచ్చు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News