నేటి సాక్షి, నారాయణపేట, 21, ఫిబ్రవరి, 2026( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఆరవ తరగతి ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్లు విడుదల చేసినట్లు ధన్వాడ మోడల్స్ స్కూల్ ప్రిన్సిపల్ వైశాల్య తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ధన్వాడ మోడల్ స్కూల్లో సంబంధించిన 100 సీట్లు ఉన్నాయని ఆమె వివరించారు. ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్య ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫామ్ లు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. 9వ తరగతి నుండి ఇంటర్ రెండవ సంవత్సరం వరకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు సైన్స్ కంప్యూటర్ గ్రంథాలయం, ఆటలు క్రీడలు హాస్టల్ సౌకర్యం పెంచడం కల్పించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 28 అన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ 1, 25 రూపాయలు, ఓసీలకు 200 రూపాయలు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె వివరించారు. ఇట్టి అవకాశాన్ని ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సద్వినియోగం చేసుకోవాలని, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆమె కోరారు.





