Thursday, March 5, 2026

*అంగన్వాడీ సెంటర్‌కు విద్యుత్ సౌకర్యాలు*———* చిన్న పిల్లల సౌకర్యార్థం ఫ్యాన్, లైటింగ్ ఏర్పాటు* బొమ్మెన గ్రామ సర్పంచ్‌కు పేరెంట్స్ కమిటీ కృతజ్ఞతలు—*

నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో..ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అంగన్వాడీ సెంటర్–2లో విద్యుత్ సమస్యను పరిష్కరించి, పిల్లల సౌకర్యార్థం ఫ్యాన్లు మరియు లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ చిందం సుధాకర్‌కు తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.*చిన్న పిల్లల కోసం సర్పంచ్ ముందడుగు.!*అంగన్వాడీ కేంద్రంలో కరెంట్ కొరత కారణంగా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని గుర్తించిన సర్పంచ్ చిందం సుధాకర్ వెంటనే స్పందించి అవసరమైన ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు చేయించడం అభినందనీయమని పేరెంట్స్ కమిటీ పేర్కొంది. దీంతో చిన్నారులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపారు.*పేరెంట్స్ కమిటీ ధన్యవాదాలు*ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ సభ్యులు పిడుగు ప్రతాప్ రెడ్డి, రాపెల్లి ఆనంద్, కడారి స్వామి, బాలె నీలకంఠం, ముంజ భూమయ్య, పోడేటి సంజీవ్, బాలె నరహరి, బాలె గంగాధర్, ఉరుమల్ల సురేష్, అల్లూరి బాపురెడ్డి, బాలె ఇస్తారయ్య తదితరులు సర్పంచ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News