నేటి సాక్షి నారాయణపేట, ఫిబ్రవరి 23, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), వైద్యం కోసం పసికందుతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా…. వైద్యం అందక పసికందు మృతి చెందిన సంఘటన మరికల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతిచెందిన పసికందు తల్లిదండ్రులు స్వప్న,ఆంజనేయులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన స్వప్న ఆంజనేయులు తమ కూతుర్ని వైద్యం కోసం మరికల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రానికి వెళ్లగా……. ఈనెల 14న 8:30 గంటల ప్రాంతంలో మరికల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లేడని…. కేవలం సిబ్బంది మాత్రమే ఉన్నారని బాధితులు వివరించారు. ఆసుపత్రిలో డాక్టర్ లేడని తమ పిల్లను దేవరకద్ర దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడం జరిగిందని బాధితులు వివరించారు. దీంతో ఆ పసికందువును మరికల్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూయిస్తుండగా పసికందువు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని బాధితులు రోదిస్తూ తెలిపారు. మరికల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్లు ఉంటే తమ బిడ్డ బతుకేదని రోధిస్తూ వివరించారు. ఇకనైనా ప్రభుత్వ జిల్లా స్థాయి అధికారులు స్పందించి మరికల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి సమయంలో రెగ్యులర్ డాక్టర్ను నియమించాలన్నారు.





