Thursday, March 5, 2026

మరుపురాని జననాయకుడు పెంట మీద నారాయణ ముదిరాజ్ పెంట మీది కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి…..

నేటి సాక్షి, నారాయణపేట,ఫిబ్రవరి 23,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), మరపురాని జననాయకుడు పెంట మీది నారాయణ ముదిరాజ్ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ప్రజా నాయకుడు మరుపురాని జననాయకుడు పెంట మీద నారాయణ ఏకాదశ దినకర్మ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. పెంట మీద నారాయణ కుటుంబ సభ్యులైన పి నర్సింలు, సహదేవ్, మరికల్ ఒకటో వార్డు సభ్యులు రాజేశ్వరి రాఘవేంద్ర, తిమ్మన్న, పి పి సత్తన్న రాములు ఎంకన్న, లక్ష్మన్న పి వెంకన్న లను మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా ముదిరాజ్ సంగం ఉమ్మడి జిల్లా నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి, సర్పంచ్ చెన్నయ్య, మాజీ సర్పంచ్, గోవర్ధన్, అనిమిరెడ్డి, సంపత్ కుమార్, సింగల్ విండో చైర్మన్ వై వెంకట్రామిరెడ్డి, భీమన్న, గోవర్ధన్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News