నేటి సాక్షి రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి – 23—————————————– ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.మొత్తం 154 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు పంపారు. ముందుగా గత ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ, పంచాయతీ రాజ్ శాఖా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని పరిష్కరించాలని ఆదేశించారు.రెవెన్యూ శాఖకు 72, గృహ నిర్మాణ శాఖకు 17, జిల్లా పంచాయతీ అధికారికి 15,డీఆర్డీఓకు 8, జిల్లా సంక్షేమ శాఖకు 7, ఎండీ సెస్ కు 6, ఎస్డీసీకి 5, జిల్లా విద్యాధికారి, ఉపాధి కల్పన అధికారికి 4 చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా వైద్యాధికారికి మూడు చొప్పున, ఎస్పీ కార్యాలయానికి 2, జిల్లా అటవీశాఖ అధికారి, జిల్లా ఎక్సైజ్ శాఖ, జిల్లా ట్రెజరీ శాఖ, పశు సంవర్ధక శాఖ, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, సిరిసిల్ల, ఎంపీడీఓ ఎల్లారెడ్డిపేట, డీఎం ఆర్టీసీ సిరిసిల్లకు ఒకటి చొప్పున వచ్చాయి.ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తదితరులు పాల్గొన్నారు.





