Thursday, March 5, 2026

పసిబిడ్డను హత్య చేసిన అగ్రకుల దురహంకారులపై కఠిన చర్యలు తీసుకోండి..!సీఎం వెంటనే స్పందించాలి – 24 గంటల్లో రిమాండ్ చేయాలి..!నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు నెలల పసిబిడ్డపై క్రూర దాడి – మానవత్వం మంటగలిసిన ఘటనఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి హత్యా నేరంగా మార్చాలని డిమాండ్8 మంది నిందితుల్లో నలుగురే అరెస్ట్ – మిగతావారిని కాపాడుతున్నారా..?బాధితులపైనే కేసులు నమోదు – పోలీసుల తీరుపై ఆగ్రహంనేటి సాక్షి మహబూబాబా ద్ ఫిబ్రవరి 24 మహబూబాబా ద్ జిల్లాలో నర్సింహులపేట మండలం కేంద్రంలో సమావేశంలో చెప్పడం జరిగింది నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో దారుణం… సమాజం తలదించుకునే ఘటన!నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేపుతోంది. అగ్రకుల దురహంకారంతో గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్న శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నిరెడ్డి తుకారం రెడ్డి తదితరులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి 8 మందిని 24 గంటల్లో రిమాండ్ చేయాలని కేవిపిఎస్ నర్సింహులపేట మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు.దేవుడి దగ్గరికి వెళ్లడమే నేరమా?దేవాలయ ఉత్సవాల సందర్భంగా “దేవుడి దగ్గరకు వెళ్లాలంటే ₹100 ఫీజు ఎందుకు?” అని ప్రశ్నించిన రజక యువకుడు గణేష్‌పై అగ్రకుల పెత్తందారులు దాడికి దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. “డబ్బులు చెల్లిస్తాం, రశీదు ఇవ్వండి” అని అడిగినందుకే సుమారు మూడున్నర గంటల పాటు అతన్ని చితకబాదినట్టు బాధితులు చెబుతున్నారు.భర్తను కొట్టవద్దని గణేష్ భార్య మౌనిక, అక్క కీర్తి ఎంత వేడుకున్నా, కాళ్లు మొక్కినా కనికరం చూపలేదని తెలిపారు. “రెండు నెలల పసిబిడ్డ ఉంది, చంపకండి” అని వేడుకున్నా వినకుండా పసిబిడ్డపై కూడా కాలితో తన్నడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోపిస్తున్నారు.హత్య జరిగిందా… లేక అటెంప్ట్ మర్డరా?ఈ నెల 18న జరిగిన ఘటనలో స్పష్టంగా పసిబిడ్డ మృతి చెందినప్పటికీ, పోలీసులు హత్యా కేసు నమోదు చేయకుండా అటెంప్ట్ మర్డర్‌గా నమోదు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. 8 మందిపై ఫిర్యాదు చేయగా నలుగురిని మాత్రమే అరెస్టు చేయడం, మిగతా వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.డీఎస్పీ శ్రీనివాస్ ముందుగా నిందితులపై కేసు నమోదు చేయాల్సి ఉండగా, బాధితులపైనే కేసులు పెట్టడం సిగ్గుచేటు అని నాయకులు మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే పోలీసులు, హంతకులకు న్యాయం – బాధితులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సీఎం ఎందుకు మౌనం?ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలాంటి దారుణం జరిగితే ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆందోళనకారులు ప్రశ్నించారు. వెంటనే సీఎం స్పందించి, హత్యా నేరం కింద 103 సెక్షన్ నమోదు చేసి నిందితులందరిని తక్షణమే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో గునిగంటి మోహన్, బానోత్ సర్వన్, నకిరకంటి స్వామి, వెంకన్న, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.పసిబిడ్డపై దాడి చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News