Wednesday, March 4, 2026

శిథిలావస్థకు చేరిన హెల్త్ ఆరోగ్య ఉపకేంద్రం.. సబ్ సెంటర్ పడగొట్టి.. కొత్త ఆరోగ్య కేంద్రం ను కట్టాలి. (. మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు .. కలబండి . అంకన్న, కే. సోషల్ వర్కర్ . నాగరాజు .ఇరుకు అద్దె భవనాలలో కొనసాగుతున్న ఆరోగ్య ఉప కేంద్రం.సోషల్ వర్కర్ కలబండి. నాగరాజు ..

నేటి సాక్షి 27 ఫిబ్రవరి పాములపాడు:- పాములపాడులోని, కేజీ రోడ్డు పక్కన ఉన్న పురాతనమైన ఆరోగ్య ఉప కేంద్రం శిధిలావస్థకు చేరి ఉన్నదని, దాన్ని పడగొట్టి, క్రింద హెల్త్ సబ్ సెంటర్ ను, పైన 108 అంబులెన్స్ కార్యాలయాన్ని ప్రభుత్వం వెంటనే కట్టాలని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న కోరారు. ఈ సందర్భంగా *మాల* *మహానాడు* *రాయలసీమ* *అధ్యక్షుడు* *కే* . *అంకన్న* *మాట్లాడుతూ* పాములపాడు మండలం లో అన్ని గ్రామాలలో అన్ని హెల్త్ సెంటర్లు కొత్త గా, చాలా చక్కగా, నిర్మించారు. కానీ పాములపాడు హెడ్ క్వాటర్ లో శిదిలావస్థకు చేరింది. దీనిని గత ప్రభుత్వంలో పాములపాడులో పడిపోవడానికి రెడీగా ఉన్న ఈ హెల్త్ సబ్ సెంటర్ ను కూలగొట్టి, క్రింద ఆరోగ్య ఉప కేంద్రాన్ని, పైన 108 అంబులెన్స్ కార్యాలయాన్ని నిర్మించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా, ఇంతవరకు దీనికి మోక్షం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడిందంటే ఈ సబ్ సెంటర్లో మోకాళ్లలోతు నీళ్లు నిలబడతాయని, పాములు, తేళ్ళు, పలు రకాల విష సర్పాలు లోపలికి వచ్చి ప్రమాదకరంగా మారిందన్నారు. దీనిని ఏ నాయకుడు, ఏ అధికారి పట్టించుకోకపోవడంతో, చిన్న ఇరుకైన అద్దె భవనంలో హెల్త్ సబ్ సెంటర్ ను వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నారని అన్నారు.అద్దె భవనంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అని, సూపెర్వైజర్, మద్దయ్య, విజిట్ కి వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని, అద్దె భవనం లో ఉంటున్నారు,చెప్పారు.మరియు ఏఎన్ఎమ్,లు మాధవి, అనురాధ వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంన్నారు అని చెప్పారు. అంతే కాకుండా పాములపాడు ఆశా కార్యకర్తలు దేవమని, వెంగమ్మ, మొగిలేశ్వరి, కుమారి వీళ్ళు కూడా ప్రతి రోజు చాలా సబ్ సెంటర్ లేక అద్దె భవనంలో చాలా ఇబ్బంది కరంగా ఉంటున్నాము అని. మాల మహా నాడు అంకన్న గారికి తమ గోడు వినిపించారు.మరియు *సోషల్* *వర్కర్* *కలబండి* *నాగరాజు* *మాట్లాడుతూ* పాములపాడు ఈ ఆరోగ్య ఉపకేంద్రం దగ్గరకు వచ్చే గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, టీకాలు వేయించుకోవడానికి వచ్చే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 108 సిబ్బంది కూడా వారికి రెస్ట్ రూమ్ లేక, ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో టేబుల్ల, కుర్చీల, మెటీరియల్ల సందులలో దోమల మధ్య నిద్ర పోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్త.జయ సూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర. శివానందరెడ్డి, జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పాములపాడులో ఆరోగ్య ఉప కేంద్రాన్ని, దానిపైన 108 అంబులెన్స్ కార్యాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మల్లికార్జున, ఏఎన్ఎంలు, మాధవి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. *పాములపాడు* *మండల* *వైద్య* *అధికారిని* . *వివరణ* *కోరగా.నాగలక్ష్మి* .. *మాట్లాడుతూ* …..పాములపాడు మండల కేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రం శిథిలావస్థలో ఉన్నది.. పడిపోవడానికి సిద్ధంగా ఉన్నది చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అనే విషయం గత ప్రభుత్వం నుండి కూడా మా పై ఉన్నతాధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు కూడా ఈ సమస్య గురించి తెలపడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అయిన చొరవ తీసుకొని పడగొట్టి కొత్త ఆరోగ్య ఉపకేంద్రం కట్టించాలని మనవి చేస్తున్నాము అని చెప్పడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News