Wednesday, March 4, 2026

*హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు*

*నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో ఈరోజు పారువెల్ల దుబ్బ పల్లె వెళ్లే మార్గమధ్యలో. లోలెవెల్ బ్రిడ్జి ఉన్నందున రాను పోను ప్రజలకు వర్షాకాలం రెండు మూడు నెలలు ఇబ్బంది పడుతున్న ప్రజలకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి. పి ఎం జి వై ఎస్. పథకంలో కిలోమీటర్ నర రోడ్డు మంజూరు చేయుటలో భాగంగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించుటకు వచ్చిన ప్రత్యేక అధికారులు. ఎన్ఐటి ప్రొఫెసర్ మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగినది . స్థానిక రైతులను అడిగి వరద ఎంతవరకు వస్తుంది అదేవిధంగా ఈ బ్రిడ్జ్ యొక్క అవసరం ఎంత ఉంది. క్షుణ్ణంగా అడిగి విషయాలు తెలుసుకున్నారు తప్పకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా ఉండేటువంటి నాణ్యమైన బ్రిడ్జిని. నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజేష్ కుమార్ ఎస్ టి ఏ మెంబర్ . పి ఎం జి ఎస్ వై ప్రొఫెసర్. ఎస్ శంకర్ ఎన్ఐటి వరంగల్. ఎస్ టి ఏ కోఆర్డినేటర్ పి ఎం జి ఎస్ వై. పి ఆర్ డి ఈ తిమ్మాపూర్ సబ్ డివిజన్ మంజుల భార్గవి. పిఆర్డిఇ రవి ప్రసాద్ మానకొండూర్ డివిజన్. పి ఆర్ స్పెషల్ ఏఈ ప్రవీణ్ కుమార్. స్థానిక సర్పంచ్ లక్ష్మీరామిరెడ్డి. ఉప సర్పంచ్ సిహెచ్ తిరుపతి. మాజీ సింగిల్ విండో చైర్మన్ అల్వాల కోటి. మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి. వార్డు సభ్యులు. సిహెచ్ మంగ మధుసూదన్ రెడ్డి. బండి పెళ్లి సంతోష్. లచ్చిరెడ్డి. కోటేశ్వర్ రెడ్డి. నరసింహారెడ్డి. సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News