Saturday, February 28, 2026

గజ్వేల్‌లో అఖిర స్కిన్ క్లినిక్ ప్రారంభంఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం

నేటి సాక్షి గజ్వేల్:–సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అఖిర స్కిన్ క్లినిక్ ను మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఘనంగా ప్రారంభించారు. 2వ వార్డు కౌన్సిలర్ గోలి మమత సంతోష్ గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవి, వైస్ చైర్మన్ కళ్యాణ్ కర్ పద్మా బాయి నర్సింగ రావు హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామాల వారికి నాణ్యమైన చర్మ వైద్య సేవలు అందించేందుకు డెర్మటాలజిస్ట్, కాస్మొటాలజిస్ట్ అయిన డాక్టర్ శ్రీరంగం అఖిర ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు.పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చర్మ సంబంధిత సమస్యలకు నిపుణులైన డాక్టర్ శ్రీరంగం అఖిర సేవలను పొందాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ కుమార్, రామారావు, సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సాదాసీదాగా కాకుండా స్థానిక ప్రజల సమక్షంలో ఉత్సాహంగా జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News