Saturday, February 28, 2026

ప్రతి ప్రాణం విలువైనదే, రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం ప్రాణాంతకం, పరిగిలో ‘అరైవ్–అలైవ్’ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,.

నేటి సాక్షి వికారాబాద్ :తెలంగాణ రాష్ట్ర డీజీపీ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అరైవ్ – అలైవ్ (ఎర్రివ్ అలీవ్ )’ కార్యక్రమంలో భాగంగా, నేడు పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారద గార్డెన్స్‌లో భారీ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై, కొడంగల్ చౌరస్తా నుండి శారద గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించి,ఇట్టి అవగాహనా కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పరిగి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ రవాణా సంఘాలకు చెందిన డ్రైవర్లకు ప్రముఖ కంటి ఆసుపత్రి మాక్స్ విజన్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోడులను పంపిణీ చేశారు. డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణే రహదారి భద్రతకు మూలమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.ఈ సదస్సులో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి పౌరుడు క్షేమంగా తన గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతోనే ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు అనాథలవుతున్నాయని, ముఖ్యంగా వృత్తిపరమైన డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కంటి చూపు పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నిద్రలేమి, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడమే మెజారిటీ రోడ్డు ప్రమాదాలకు కారణం. వాహనం నడిపే సమయంలో క్రమశిక్షణ పాటిస్తే మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడగలము” అని డ్రైవర్లను ఉద్దేశించి తెలిపారు.కంటి చూపులో లోపాలు ఉన్న డ్రైవర్లకు ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని, అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సూచించిన కళ్లజోడులను తప్పనిసరిగా వినియోగించాలని ఎస్పీ కోరారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయడంతో పాటు, వాహనాలకు రిఫ్లెక్టర్ స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ భారీ అవగాహన కార్యక్రమంలో ఆటో, కార్, బస్సు, లారీ, హెవీ వెహికల్ డ్రైవర్ యూనియన్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. డ్రైవర్లతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్,పరిగి ఏం ఆర్ ఓ వెంకటేశ్వరి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,పరిగి ఆర్ టీ ఓ వీరేందర్ నాయక్,పరిగి ఆర్ టీ సి ,డి మ్ , కృష్ణమూర్తి, పరిగి మునిసిపల్ కమిషనార్ వెంకటయ్య, జిల్లా పోలీస్ ప్రసిడెంట్ ఆశోక్, పరిగి సబ్ డివిజన్ ఎస్.ఐ లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News