Saturday, February 28, 2026

*నేను కౌన్సిలర్ నే… కానీ మీ సేవకున్ని.!*——* స్వయంగా మంచినీటిని సరఫరా చేస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్* వేసవి ముందస్తు చర్యలు – ఒకటో వార్డు ప్రజల ప్రశంసలు—–*

నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )ఈ రోజుల్లో రాజకీయాల్లో హంగు, ఆర్భాటం సర్వసాధారణంగా మారిన తరుణంలో కోరుట్ల పట్టణంలో ఒక ప్రజాప్రతినిధి భిన్నంగా నిలుస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే అధికార వైభవం చాటుకునే పరిస్థితుల్లో..’నేను మీరు ఎన్నుకున్న కౌన్సిలర్ నే… కానీ మీ సేవకున్ని’ అనే సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ ఒకటో వార్డు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన మెట్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్.!*వేసవి ముందు జాగ్రత్త – మంచినీటి సరఫరా ప్రారంభం*వేసవికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఒకటో వార్డులో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధమైన తాగునీటిని ఇంటింటికి సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందుగానే స్పందించడం ఆయన ప్రజాసేవకు నిదర్శనంగా నిలుస్తోంది.*స్వయంగా ఇంటింటికి – అబ్బురపరిచిన చర్య*సాధారణంగా ప్రజాప్రతినిధులు ఆదేశాలు ఇస్తే సరిపోతుంది అనుకునే ఈ కాలంలో… స్వయంగా ట్యాంకర్ వద్ద నిలబడి, ఇంటింటికి వెళ్లి మంచినీటిని సరఫరా చేయడం స్థానికులను అబ్బురపరిచింది. మున్సిపల్ వైస్ చైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ ప్రజల మధ్యే ఉండి సేవ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రజలే నాకు బలం’ అనే భావనతో పని చేస్తున్నారని వార్డు వాసులు అభినందిస్తున్నారు.*ప్రజల సమస్యలే ప్రాధాన్యం*ఈ సందర్భంగా ఓంకారి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఒకటో వార్డు ప్రజలకు తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. నీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రోడ్లు వంటి మౌలిక సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.*సేవే లక్ష్యం – ఆదర్శంగా నిలుస్తున్న ప్రజాప్రతినిధి*హోదా, అధికారానికి అతీతంగా ప్రజల మధ్య ఉండి పనిచేయడం వల్ల ఒకటో వార్డు ప్రజల్లో నమ్మకం పెరిగిందని స్థానికులు అంటున్నారు. రాజకీయాల్లో సేవా భావం తగ్గిపోతుందనే విమర్శల మధ్య ఓంకారి నవీన్ కుమార్ చూపిస్తున్న వినయం, కార్యదీక్ష ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.వేసవి కాలం పొడవునా మంచినీటి సరఫరా సజావుగా కొనసాగిస్తామని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.!_____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News