Saturday, February 28, 2026

*విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరేందుకు నిరంతరం శ్రమించాలి** పీఎం పోషణ్ తనిఖీ లో భాగంగా కేజీబీవీ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్* మధ్యాహ్న భోజనం, పదో తరగతి ఫలితాలు, వసతులపై సమగ్ర పరిశీలన—-*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )’పీఎం పోషణ్’ తనిఖీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం, విద్యా ప్రమాణాలు, వసతి సదుపాయాలు తదితర అంశాలపై సమగ్రంగా తనిఖీ నిర్వహించారు.*కామన్ మెనూ ప్రకారం భోజనం వండుతున్నారా.?*ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం కామన్ మెనూ ప్రకారం వండుతున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలను సమీక్షించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, కూరగాయలు మరియు ఇతర సరుకుల సామగ్రిని స్వయంగా తనిఖీ చేసి సంబంధిత రికార్డులను పరిశీలించారు. పీఎం పోషణ్ పథకం లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన, పోషకాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు.*పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి*అనంతరం పదవ తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం తీసుకుంటున్న ప్రణాళికలపై స్పెషల్ ఆఫీసర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక తరగతులు, రివిజన్ ప్లాన్, మోడల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.*మెస్ కమిటీ సమావేశాలు నియమితంగా నిర్వహించాలి*మెస్ కమిటీ వ్యవహారాలపై వివరాలు తెలుసుకుని కమిటీ సమావేశాలు నియమితంగా నిర్వహించాలని సూచించారు. భోజన నాణ్యత, సరఫరా విధానాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.*విద్యార్థులతో ముచ్చట – లక్ష్యాలపై ప్రోత్సాహం*కలెక్టర్ విద్యార్థులతో నేరుగా ముచ్చటించి పాఠశాలలో కల్పిస్తున్న అన్ని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠ్యాంశాల్లోని పలు ప్రశ్నలు అడిగి వారి చదువు, లక్ష్యాలు, ఆశయాలపై చర్చించారు. చదువును ఇష్టంతో అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.*ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ఆదేశాలు*విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి ఆదేశించారు. పీఎం పోషణ్ పథకం లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలని మరోసారి స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందుతున్న ఆహారం, వసతి సదుపాయాలపై నేరుగా అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము, తహసీల్దార్ రామ్మోహన్, కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.——

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News