Friday, February 27, 2026

బ్యాంక్ లో బంగారం చోరీ…నిందితుల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేత-కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పీ రాజశేఖర్ రాజు

నేటిసాక్షి, మిర్యాలగూడ : బ్యాంకు లో నగలు దాచుకునేందుకు వెళ్లిన కుటుంబానికి మంచి నీరు త్రాగి వొచ్చేసారికి ఆ బంగారం పోయిన సంఘటన నాగార్జున సాగర్ లో జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 23వ తేదీన నాగార్జునసాగర్ కు చెందిన కొమ్ము రాహేల్ కుమారి, భర్త రవి తన బంగారాన్ని బ్యాంకులో భద్రపరచుకోవడానికి వెళ్లిన సందర్భంలో, బ్యాగు పక్కనపెట్టి మంచినీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు, బంగారం ఉన్న బ్యాగు కనిపించకలేదు. వెంటనే నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పైలాన్ కాలనీకి చెందిన మహిళ తీసుకున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర రాజు ఆధ్వర్యంలో 24 గంటలలో, 9తులాల బంగారం, నల్లపూసల గొలుసు పుస్తెలతాడు, చంద్రహారం రెండు ఉంగరాలు, ఆరు తులాల దిద్దులు మహిళ నుండి రికవరీ చేసి, బాధిత మహిళకు అందజేశారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న సీఐ బీ శ్రీను నాయక్ ఎస్ఐ జి ముత్తయ్య రిసెప్షన్ రాజేశ్వరి వారి సిబ్బందిని డీఎస్పీ రాజశేఖర రాజు అభినందించారు. ఈ సందర్బంగా బాధిత మహిళా పోలీస్ లకు ధన్యవాదములు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News