నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )………………………………….ఆల్ ఇండియా ఎల్ ఎఫ్ ఎం ఓ వై 25 -26 ఐఐటి నీట్ ఒలంపియాడ్ ఎగ్జామ్స్ లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన అభ్యాస పాఠశాల విద్యార్థిని విద్యార్థులు. నేషనల్ 2nd ర్యాంక్ సాధించిన విద్యార్థులు 1.శ్రీయన్ VI , 2.మహీధర్ రెడ్డి VI , 3.మణికంఠ IX, 4.శ్రీ కారుణ్య IX. అదేవిధంగా నేషనల్ 3rd ర్యాంక్ సాధించిన విద్యార్థులు 1.ప్రాక్యత్ VII, 2 రాజేశ్వరి VII, 3.శ్రీ వరాలిక VIII, 4.సహస్ర VIII, 5.అశ్రీత్ IX, 6.శ్రీ జిత్ IX, 7.భువన్ IX. అదేవిదంగా స్కాలర్ స్ప్రింట్ అవార్డు అఫ్ ఎక్సలెన్స్ అవార్డు ను హంసిని VII క్లాస్ విద్యార్థిని పొందడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ మెమొంటోలు సర్టిఫికెట్లు అందించడం జరిగింది . ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా స్థానిక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరు కావడం జరిగింది.ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందించడం జరిగింది. ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్, మెమంటోస్ అందించడం జరిగింది.*ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ* విద్య మరియు ఆరోగ్యం అనేది విద్యార్థులకు చాలా అవసరం అని చెప్పారు.ముఖ్యంగా ఆరోగ్యాంగా ఉంటేనే విద్య పైన శ్రద్ద పెరుగుతుంది అని అన్నారు.ఐఐటి నీట్ ఎగ్జామ్స్ లో పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు అవగాహన కల్పించడం చాలా అభినందించవలసిన విషయం అన్నారు. అదేవిదంగా స్కూల్ యాజమాన్యం కూడా ఐఐటీ నీట్ ఎగ్జామ్స్ విషయంలో విద్యార్థులకు పోటీ తత్త్వం ఇప్పటినుండే తెలియజేయడం చాలా మంచి సందర్భం అన్నారు.ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు స్థానిక కౌన్సిలర్ కోరుకంటి రాము,మాజీ కౌన్సిలర్ కొలగాని సత్యం,మాజీ కోఆప్షన్ శ్రీనివాస్,పాఠశాల కరస్పాండ్ భోగా రవి ప్రసాద్, శ్రీదేవి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.





