నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )మెట్పల్లి పట్టణంలోని మేరు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ దాసమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మైలారపు లింబాద్రి, ఓంకారి నవీన్ కుమార్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మేరు సంఘ సభ్యులు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. మేరు మహిళా సంఘం సభ్యులు కూడా వారిని గౌరవించి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం తరఫున నేతలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*టైలర్ల సేవలకు గుర్తింపు*ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మాట్లాడుతూ టైలర్ డే సందర్భంగా మేరు సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. మన పూర్వీకుల కాలం నుంచి వస్త్రాలపై వివిధ రకాల డిజైన్లు కుట్టి అందం తీసుకువచ్చిన మేరు కులస్తుల కృషి ప్రశంసనీయమన్నారు. రకరకాల డిజైన్లతో బట్టలను అందంగా తీర్చిదిద్దే మేరు వృత్తిదారులు సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. మేరు సంఘ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మెట్పల్లి పట్టణం మాత్రమే కాకుండా ఇతర మండలాలు, జిల్లా కేంద్ర స్థాయిలో కూడా అవసరమైన పనులను చేయిస్తామని తెలిపారు.బీసీ డి నుండి బీసీఏలోకి మార్పు కోసం జరిగిన ఉద్యమాల్లో మేరు సంఘం పాల్గొన్న త్యాగాలను గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో అన్ని కులాలు సమానమని, అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేరు సంఘ సభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.________





