నేటి సాక్షి వికారాబాద్ లయన్స్ క్లబ్బు వికారాబాద్ ఆధ్వర్యంలో 16 వ వార్డు జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏం ఈ ఓ రేణుకాదేవి, వార్డు కౌన్సిలర్ కడియాల వేణుగోపాల్, లయన్స్ క్లబ్ స్టేట్ చైర్మన్ శ్రీని సుందర్ రావు, డిస్టిక్ చైర్మన్ లవకుమార్, వికారాబాద్ ప్రెసిడెంట్ సాధు సత్య నంద్ మరియు క్లబ్ సభ్యులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, విద్యార్ధినులు, నాయకులు, తదితరులు.ఈసందర్భంగా గడ్డం అనన్య మాట్లాడుతూ.. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వికారాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులకు నా అభినందనలు. అవసరమైన వారందరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి. పేదలకు సేవ చేయాలంటే డబ్బులు కాదు ముందుగా మంచి మనసు ఉండాలి. పేదలకు సేవ చేయాలనే తపన ఉన్న మా నాన్న , తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని చూసే నేను కూడా చిన్న వయసులోనే రాజకీయాల లోకి రావడం జరిగింది. మీ ఆశీర్వాదంతో 24 సంవత్సరాలకే మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యాను. నాన్న గారిని ఆదర్శంగా తీసుకుని నా శక్తి మేరకు నేను కూడా పేదలకు సేవ చేస్తాను. ముఖ్యంగా బాలికలు, మహిళల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలకు ప్రాముఖ్యత ఇస్తాను.సామాజిక సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి,, నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను, నా సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. ఈసందర్భంగా పదవ తరగతి బాలికలకు ఎగ్జామ్ ప్యాడ్లు, జామెట్రీ బాక్స్, పెన్నులతో పాటుగా పాఠశాలకు స్పోర్ట్స్ కిట్ ను అందజేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.





