Wednesday, March 4, 2026

అన్యాయాలపై పోరాటానికి హోలీ ప్రతీక: మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

నేటి సాక్షి గజ్వేల్ :—- హోలీ పండుగ కేవలం రంగులు చల్లుకునే వేడుక మాత్రమే కాదని, అన్యాయాలపై పోరాటానికి, అసమానతలపై తిరుగుబాటుకు, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా నిలబడే సంకల్పానికి ప్రతీక అని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు.గజ్వేల్ పట్టణంలో హోలీ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ప్రజలు రంగులు చల్లుకుంటూ కేరింతలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ జాతి, వర్గ, మత భేదాలను చెరిపేసి ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కుటుంబంలో సమానత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి రైతుకు గౌరవం దక్కే సమాజ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అంతకుముందు ప్రజ్ఞాపూర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఊడేం సారిక శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆడియో పాటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేస్తారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ, భవిష్యత్తులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.మనిషిలోని చెడును విడిచిపెట్టి మంచి లక్షణాలను అలవాటు చేసుకుని సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గజ్వేల్ నరసింహులు, సభ్యులు షరీఫ్, మామిడి సురేష్ గౌడ్, గోపిశెట్టి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News