Wednesday, March 4, 2026

అర్ధరాత్రి కూల్చివేతకు ప్రతిగా అదే చోట అంబేద్కర్ గద్దె పునర్నిర్మాణంపోలీసు బలగాల మధ్య ఉద్రిక్తత – డిబిఎఫ్ నేత అరెస్టు యత్నం విఫలం

నేటి సాక్షి గజ్వేల్…..సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో B. R. Ambedkar విగ్రహ ఆవిష్కరణ కోసం నిర్మించిన గద్దెను ఆర్ & బి అధికారులు అర్ధరాత్రి కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి ఈ చర్య జరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు.సమాచారం అందుకున్న దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ నాయకత్వంలో బుధవారం ఉదయం గ్రామస్తులు కూల్చివేసిన అదే ప్రదేశంలో గద్దె పునర్నిర్మాణం ప్రారంభించారు. భారీ పోలీసు బలగాలు మోహరించినప్పటికీ, గ్రామస్తులు వెనక్కి తగ్గకుండా యుద్ధ ప్రాతిపదికన గద్దె నిర్మాణాన్ని పూర్తి చేశారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, డిబిఎఫ్ నేత శంకర్‌తో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శంకర్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు యత్నించగా మహిళలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. మహిళల నిరసనతో పోలీసులు అరెస్ట్ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో విగ్రహ స్థాపనను అడ్డుకోవడం సరికాదన్నారు. అర్ధరాత్రి దొంగల్లా గద్దె కూల్చివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆక్షేపించారు. గద్దె కూల్చివేతకు బాధ్యులైన ఆర్ & బి అధికారులను, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు.సమాచారం అందుకున్న అదనపు పోలీస్ కమిషనర్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకోవాలని సూచించగా, నాయకులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. చర్చల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు కొంత సద్దుమణిగినట్లు సమాచారం.గ్రామంలో ఒకవైపు భారీ పోలీసు బలగాలు మోహరించగా, మరోవైపు గ్రామస్తులు గద్దె నిర్మాణంలో భాగస్వాములై ఐక్యతను ప్రదర్శించారు. ఘటనపై స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి,జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, దళిత సంఘాల నాయకులు కృష్ణ, పుట్ట రాజు ,బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు మహిళ నాయకురాలు రాణి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News