నేటి సాక్షి గజ్వేల్ : లిక్కర్ కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత నిర్దోషిగా బయటపడిన నేపథ్యంలో ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుండి తిరుమల వరకు భక్తి పూర్వకంగా పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్రలో గజ్వేల్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, తెలంగాణ జాగృతి రాష్ట్ర వైస్ చైర్మన్ కొట్టాల యాదగిరి ముదిరాజ్ పాల్గొన్నారు. గతంలో కవిత లిక్కర్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మొక్కుకున్నామని ఆయన తెలిపారు.ఆ మొక్కు నెరవేరిన నేపథ్యంలో శుక్రవారం అలిపిరి మెట్లు మార్గం ద్వారా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నట్లు యాదగిరి ముదిరాజ్ వెల్లడించారు. కవితపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపితమైందని, అయినప్పటికీ చివరకు న్యాయం గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై అక్రమంగా కేసు నమోదు చేసినప్పటికీ చివరకు ధర్మమే గెలిచిందన్నారు. న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజలకు ఉన్న విశ్వాసం మరింత బలపడిందని, కోర్టుల తీర్పులు నిజాన్ని వెలుగులోకి తీసుకువస్తాయని ఈ పరిణామం మరోసారి నిరూపించిందన్నారు.కవిత నిర్దోషిగా బయటపడటంతో ఆమె అభిమానులు, జాగృతి నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొని తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తి, ఆనందం మధ్య ఈ పాదయాత్ర ప్రత్యేకంగా నిలిచిందని వారు పేర్కొన్నారు.





