నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )………………………………..రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోశుక్రవారం పీఎంశ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ ధరూర్ క్యాంప్ పాఠశాల విద్యార్థినిలకు సానిటరీ ప్యాడ్ కిట్స్ పంపిణి చేశారు. ధరూర్ పాఠశాలలో చదువుతున్న 61 మంది బాలికలకు పునర్వినియోగ సానిటరీ ప్యాడ్ కిట్స్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా విద్యాధికారి కె రాము, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, రాజు, గైనకాలజిస్టు డాక్టర్లు అరుణ, హరిత, కార్యక్రమ సమన్వయకర్త విద్యా దేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీలత, షబానా తదితరులు పాల్గొన్నారు.





