Saturday, March 7, 2026

*ప్రజా పోరాటాలకు విరాళాలిచ్చి సహకరించండి..సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు*…

నేటి సాక్షి 07 మార్చి జూపాడుబంగ్లా:–నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ప్రజా పోరాటాల నిర్వహించే సిపిఐ పార్టీకి విరాళాలు ఇచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సీపీఐ పార్టీ నీ ఆదరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు మండల నాయకులు మక్బుల్ భాష, ఎం.రాజులు అన్నారు..శనివారం మండలంలోని తుడిచర్ల గ్రామంలో గడపగడపకు సిపిఐ కార్యక్రమంను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్న పాలక ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో అనేక స్థానిక సమస్యలపై కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు నిర్వహిస్తుందని తమ వంతు బాధ్యతగా పేద ప్రజల పార్టీగా ఉన్న సిపిఐ పార్టీని ఆదరించేందుకు గడపగడపకు సిపిఐ మీ ముందుకు వస్తుందని మీ వంతు బాధ్యతగా విరాళాలు ఇచ్చి ముందుకు నడిపించాలని వారు ప్రజలను కోరారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన పాలక పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని గ్రామీణ ప్రాంత సమస్యలను పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. పేద ప్రజలకు అండగా ఏ సమస్య వచ్చినా ఎర్రజెండా చేత పట్టి నిలబడే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీని విరాళాలు అందించి ముందుకు నడిపించాలని వారు కోరారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News