నేటి సాక్షి మార్చ్ 8 (మంచిర్యాల) శ్రీధర్ దమ్మమంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం మరియు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక బీసీ సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని కన్న ముందు వివిధ రంగాలలో ముందు అడుగు వేస్తున్న అభివృద్ధి సాధిస్తున్న మహిళ సోదరీమణులకు పూల బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిగా మనకు జన్మనిచ్చి,చెల్లిగా తన ప్రేమను పంచి,భార్యగా తన జీవితాన్ని ధారబోసి,బిడ్డగా అనురాగం పంచుతూ,మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు. అదే విధంగా పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అప్పుడే మహిళా శక్తి అంటే ఏమిటో ప్రపంచానికి తెలుస్తుందని పేర్కొన్నారు. సృష్టికి మూలం స్త్రీ లే అనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు అని సమాజంలో సగం మన జీవితంలో సగం మహిళలలనే విషయాన్ని మరిచిపోకూడదని వారిని అందరూ సగర్వంగా అభినందించాలని అన్నారు.ఈ ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాళ్ల బండి రాజన్న అధ్యక్షులు గజేల్లి వెంకటయ్య ప్రధాన కార్యదర్శి పూజారి నరసయ్య ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని కార్యదర్శి పి రామ్ రెడ్డి,అడిచర్ల రాజేశం నాయకులు A.గంగయ్య సిహెచ్ రామస్వామి G.లక్ష్మణ్, పర్వతాలు యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారూ





