నేటి సాక్షి – మెట్‌పల్లి*( రాధారపు నర్సయ్య )మెట్‌పల్లి పట్టణంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏడో రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని మొదటి వార్డు బాయ్స్ హై స్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్, కౌన్సిలర్లు హాజరయ్యారు.*విద్యార్థులతో ప్రతిజ్ఞ*ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం త్వరలో జరగబోయే పదో తరగతి బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ తోపాటు కౌన్సిలర్లు పలు సలహాలు, సూచనలు అందించారు.పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్, కౌన్సిలర్లు ఎగ్జామ్ ప్యాడ్లు మరియు హాల్ టికెట్లను పంపిణీ చేశారు.*మరుగుదొడ్ల సమస్యపై స్పందన*ఈ కార్యక్రమం సందర్భంగా పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల సిబ్బంది తెలియజేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ సమస్యను వెంటనే పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అదేవిధంగా పాఠశాలలో ఉన్న భోజనశాలను కూడా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పరిశీలించి అక్కడి సదుపాయాలపై సమాచారం తీసుకున్నారు.—-




