*నేటిసాక్షి న్యూస్* తిరుమలాయపాలెం మార్చి 12 (మెట్టు రుద్రరాజు)మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో గురువారం ఘనంగా కట్ట మైసమ్మ పోతురాజు విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామం లోని పెద్ద చెరువు కట్టపై నూతనంగా గ్రామస్తుల సహకారంతో నిర్మించిన గుడి లో కట్ట మైసమ్మ ఎదురుగా పోతురాజు విగ్రహాలను వేద పండితుల చేతుల మీదుగా వేదమంత్రాల తో మంగళ వాయిద్యాల మధ్య గ్రామస్తుల అందరి సమక్షంలో విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా హాజరై విగ్రహ ప్రతిష్టను తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొక్కిరేణి గ్రామానికి చెందిన మల్లెల వెంకటేశ్వర్లు.. భాగ్యమ్మ ఎలకొండ సాంబయ్య … పద్మ గంట కృష్ణ నిర్మల దంపతులు పీటల మీద కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో ఉండాలని గ్రామ ప్రజలందరినీ కట్టమైసమ్మ తల్లి పోతురాజు దీవెనలు ఉండాలని వారు అమ్మవారిని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్ మాజీ జెడ్పిటిసి ఎల్లకొండ నాగేశ్వరరావు చావా వెంకట్రావు నంబూరు శేషు గద్దల నాగేశ్వరరావు చావా రాజేష్ సిరి గద్దె ఉపేందర్ గుగ్గిళ్ళ అంబేద్కర్ ఏలూరి వెంకట్రావు ఉలవ వీరభద్రం ఎలకొండ బుచ్చయ్య గద్దల మధు ఊడుగు ఉపేందర్ గుగ్గిళ్ళ అశోక్ తదితరులు పాల్గొన్నారు




