నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )రంజాన్ మాసం సందర్భంగా కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. గురువారం పట్టణంలోని గడిబురుజు వద్ద ఉన్న ఏజేఎం ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.*సోదరభావానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు*రంజాన్ మాసం పవిత్రతను గుర్తుచేసుకుంటూ నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపవాస దీక్ష అనంతరం ప్రార్థనలు నిర్వహించి సమిష్టిగా ఇఫ్తార్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ రంజాన్ మాసం శాంతి, సౌహార్దానికి ప్రతీక అని పేర్కొంటూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు._____




