నేటి సాక్షి, ఎండపల్లి:* మండలం పరిధిలోని చర్లపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని పశువులను ప్రమాదకర వ్యాధుల నుండి రక్షించేందుకు చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పడిదం లావణ్య–మొగిలితో కలిసి పశు వైద్యాధికారి డాక్టర్ పి. శ్రీప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న టీకాల కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా 63 ఆవులు, ఎడ్లు మరియు 71 గేదెలకు పశు వైద్య సిబ్బంది టీకాలు వేసి, వివరాలను పాడి రైతుల ఆధార్ కార్డు ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేసి, పశువులకు ప్రత్యేక ట్యాగ్లు అమర్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అల్గం తిరుపతి, కార్యదర్శి తిరుపతి రెడ్డి, వార్డు సభ్యుడు జెల్ల శ్రీనివాస్, నాయకులు మెరుగు శ్రీనివాస్, జక్కుల మహేష్, పత్తిపాక శ్రీధర్, మాదాసు శ్రీనివాస్, జంజుపెల్లి నరేష్, సిగిరి మహేష్, బుర్రి మహిపాల్, పశు వైద్య సిబ్బంది ఎస్.రాజేందర్, జి.నవీన్, కుమార్, కె.పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





