*నేటి సాక్షి మార్చ్ 13 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ *విద్యార్థులందరూ కూడా ఈ 365 రోజులు ఎంతో కష్టపడి చదువుకున్న చదువును రేపటి నుంచి జరిగే ఎగ్జామ్స్ లలో ఆ మూడు గంటల్లోనే ప్రజెంట్ ప్రజెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాసి మంచి ఫలితాలు సాధించాలని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ వారు కోరుచున్నారు*👉*పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ కే శ్రీనివాసరావు గారు తెలిపారు.* 👉*పట్టణ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా *సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు తెలిపారు*.👉బెల్లంపల్లి పరిధిలోని మొత్తం 3 పరీక్ష కేంద్రాల్లో రేపటి అనగా 14 మార్చి నుండి ఏప్రిల్ 16 2026 వరకు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 👉పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీఐ గారు తెలిపారు.*👉1. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.**👉2. సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.**3. పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు తేది రేపటి నుండి ఏప్రిల్ 16 నుండి 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని సీఐ శ్రీనివాస రావు గారు ఆదేశించారు.*ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని సీఐ శ్రీనివాస రావు హెచ్చరించారు





