నేటి సాక్షి 13 మార్చి పాములపాడు:–నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రానికి చెందిన శ్రీ వివేకానంద విద్యా విహార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ సైన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించారు.పాఠశాలలో 4వ మరియు 6వ తరగతులు చదువుతున్న తోయ జాక్షి, నాగేంద్రుడు, షిందు జాతీయ స్థాయిలో ఉత్తీర్ణత సాధించి గోల్డ్ మెడల్స్ పనింద్ర సరిత మధుప్రియ వైష్ణవి విజయ రాజేంద్రప్రసాద్ జాతీయ సైన్స్ ఒలంపియాడ్ ప్రశంస పత్రాలు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మండల వైద్య అధికారిణి డాక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని విజేత విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రధానం చేసి అభినందించారు.అలాగే అదే పాఠశాలకు చెందిన మరో ఎనిమిది మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాలు మరియు బహుమతులు అందుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అనేటడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నాయకులు క్రీస్తు దాసు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లలో నిర్వహించే సైన్స్ ఒలంపియాడ్ పరీక్షలు గ్రామీణ ప్రాంతమైన వివేకానంద హై స్కూల్ లో నిర్వహించడం గుణాత్మక విద్య కు నాంది పలుకుతుందన్నారు . పరీక్షలు మూడు గోల్డ్ మెడల్స్ ఎనిమిది మందికి పైగా జాతీయస్థాయిలో సైన్స్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ లలో వరుసగా అత్యున్నత ప్రతిభ సాధించారన్నారు. కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్ మాట్లాడుతూ సైన్స్ ఒలంపియాడ్ ఫెడరేషన్ ద్వారా 70 దేశాల్లో నిర్వహించే ఐ ఎస్ ఓ ఐ ఎం ఈ ఎన్ ఎస్ ఓ వంటి నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీల్లో శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థులు పాల్గొని అత్యున్నత స్థాయి పురస్కారాన్ని పొందడమే కాకుండా మూడు గోల్డ్ మెడల్స్ 8 కి పైగా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ నేషనల్ ఒలంపియాడ్స్ లో జాతీయస్థాయి ప్రశంసా పత్రాలు విద్యార్థుల ప్రతిభ పాటలకు సంబంధించిన సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు చల్లా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో శ్రీ వివేకానంద హై స్కూల్ స్థాపించి ఎంతోమంది గ్రామీణ విద్యార్థులను జాతీయస్థాయికి తీసుకెళ్లాల ప్రతిభను వెలికితీస్తూ నేషనల్ ఒలంపియాడ్ పరీక్షలలో గోల్డ్ మెడల్స్ సాధించేలా కృషి చేసిన ఆర్ఎస్ఆర్ గోపాల్ ని అభినందించారు. భవిష్యత్తులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ని తట్టుకునేలా ఇలాంటి పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను జాతీయస్థాయి ఒలంపియాడ్ పరీక్షల్లో గోల్డ్ మెడల్స్ ప్రశంసా పత్రాలు వచ్చేలా కృషిచేసిన వివేకానంద పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు రాయపాటి శ్రీదేవి ఉపాధ్యాయులు బాలకృష్ణ మా షాజహాన్ సురేంద్ర రామస్వామి హబీబుల్లా విజయ్ నారాయణ చారి జయలక్ష్మి చంద్రకళ గాయత్రి నసీమా పుష్పలత రాణి శ్రీలక్ష్మి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.📸 ఫోటో క్యాప్షన్ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ సైన్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు మండల వైద్య అధికారిణి డాక్టర్ నాగలక్ష్మి మెడల్స్ అందజేస్తున్న దృశ్యం.





