Friday, March 13, 2026

కోటకొండలో విజయవంతంగా ముగిసిన మెగా ఉచిత వైద్య శిబిరం….డాక్టర్ నర్సింగ్ రావు…..

నేటి సాక్షి నారాయణపేట, మార్చు 13,( రిపోర్టర్ ఇమామ్ సాబ్)నారాయణపేట మండలo కోటకొండ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోటకొండ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైందని తెలియజేశారు డాక్టర్ నర్సింగ్ రావు, ఉదయం 10 గంటలకు గ్రామ సర్పంచ్ ఈ.వెంకట్ రాములు గౌడ్, ఉప సర్పంచ్ చెన్నప్ప యాదవ్, గ్రామపంచాయతీ కార్యదర్శి చాణిక్య రెడ్డి, వార్డు మెంబర్ పేరపళ్ళ రఫీ, కాశీనాథ్, ఎడ్ల రాజు ప్రభంజన్ రావు, రామకృష్ణ, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు వార్డు మెంబర్లు కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు, అనంతరం ప్రజలకు వైద్య శిబిరంలో ఏ రకమైన వైద్యం అందిస్తున్నారో డాక్టర్ల దగ్గరికి వెళ్లి ప్రజాప్రతినిధులు డాక్టర్లు పరిశీలించారు, కోటకొండ గ్రామంలో ఇలాంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా గొప్ప విషయమని ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రభుత్వ వైద్యం క్యాంపులను ఉపయోగించుకొని తమ ఆరోగ్యాన్ని మెరుగుగా ఉంచుకోవాలని వారు ప్రజలకు సూచించారు, ప్రభుత్వాలు ప్రభుత్వ డాక్టర్లు ప్రజల కోసమే ఉంటారని వారితో వైద్యం చేయించుకోవడం మన బాధ్యత అని ప్రజలకు, సూచించారు, ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎన్నో రకాలైన రోగాలకు టెస్టులు చేసి వారికి ఇక్కడే మందులు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ నర్సింగ్ రావు వారికి,తెలియజేశారు. డెంటల్ గైనలజిస్ట్, జనరల్ మెడిసిన్స్, ఈఎన్టి ప్రత్యేక డాక్టర్ల బృందం క్యాంపులో ప్రజలకు టెస్టులు చేసి వారికి ఇక్కడే మందులు ఇవ్వడం జరిగిందని అన్నారు, ఓపి 100 నుంచి 150 మంది ఓపీ నమోదు అయ్యింది,, ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని తాజా మాజీ ప్రతినిధులు డాక్టర్లు , మొహమ్మద్ మంజూర్, డాక్టర్ చందన, డాక్టర్ శృతి, డాక్టర్, విరోజా, డాక్టర్ వినోద్, సూపర్వైజర్ సరస్వతి, ల్యాబ్ టెక్నీషియన్ దశరథ్, ఏఎన్ఎం లు అనురాధ, సావిత్రమ్మ, అరుణ సుజాత, ఆశ వర్కర్లు రాధిక అంజమ్మ కల్పనా, వెంకటేశ్వరి, జయమ్మ, రేణుక మంజుల, స్టాఫ్ నర్స్ నిర్మల, చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News