నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి మార్చి 13 తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తోందని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ కాలనీలో లబ్ధిదారులు బాలే రావు రేణుక బాయి. భారత్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ అబ్దుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్ ,పట్టణ అధ్యక్షుడు రఫ్ఫు,లబ్ధిదారులతో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించారు.అనంతరం శ్యామ్ నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందుతుందని హామీ ఇచ్చారు. త్వరలోనే రెండు, మూడు విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు కానున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ జిల్లా నాయకుడు ఆసిఫ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు వైరగడే గోవింద్, నిఖిల్,ఆసిఫ్, సఫాన్ పార్టీ కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





