Monday, March 16, 2026

గత 28 సంవత్సరల నుండి పెంపుదలకు నోచుకోని బొగ్గు గని పెన్షనర్లకు కరువు భత్యం తో కూడిన 50 శాతం పెన్షన్ పెంచాలనే డిమాండ్ తో ఈ నెల 30 న న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని సింగరేణి విశ్రాంత ఉద్యోగులు జయప్రదం చేయాలని పిలుపు…

*నేటి సాక్షి మార్చి 16 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం సమావేశమై దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల పెన్షనర్లకు అందుతున్న అతి తక్కువ పెన్షన్ ను కరువు భత్యం తో కూడిన 50 శాతం కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలనే డిమాండ్ తో అఖిల భారత బొగ్గు పెన్షనర్ల సంఘం పిలుపు మేరకు ఈ నెల 30 న న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా ను జయప్రదం చేయాలని ఈరోజు జరిగిన సమావేశం విశ్రాంత ఉద్యోగులకు పిలుపునిచ్చినది . 1998 వ సంవత్సరం లో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్ లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని అగ్రిమెంట్ ఉన్న గత 28 సంవత్సరాల నుండి ఒక పైసా కూడా పెన్షన్ పెంచకపోవడం మూలన అతి తక్కువ పెన్షన్ పొందుతున్న బొగ్గు పెన్షన్ దారులు నానా రకాలుగా ఆర్ధిక ఇబ్బందులు పడుతూ వారికి రోగాలు నొప్పులు వచ్చిన కూడా సరి అయిన వైద్యం అందక చనిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని గత 28 సంవత్సరాల నుండి ఎన్నో రకాల పోరాటాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నపాటికి కేంద్ర ప్రభుత్వం కానీ , కోల్ ఇండియా యాజమాన్యం కానీ, జాతీయ కార్మిక సంఘాలు కానీ బొగ్గు పెన్షన్ దారుల కుటుంబాల దీన స్థితి పై స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. గోల్డ్ అండ్ షేక్ పెట్టుకున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు 350 నుండి 1000 రూపాయిల లోపల అతి తక్కువ పెన్షన్ పొందుతున్న వారు సింగరేణి వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారనే విషయాన్ని గమనించాలని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఆసరా పెన్షన్ ల కన్నా అతి తక్కువ పెన్షన్ పొందుతున్న బొగ్గు పెన్షన్ దారుల కుటుంబాలు ఏ విధమైన జీవన ప్రమాణాలు కొనసాగిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా యాజమాన్యం గ్రహించాలని కోరినారు. CPRMS కు సంబంధించిన హెల్త్ కార్డ్ పై 25 లక్షల వరకు వైద్య సౌకర్యాలు అందించాలని అదే విధంగా 2016 నుండే పెరిగిన గ్రాడ్యుటీ సీలింగ్ 20 లక్షలు చెల్లించాలని ఈ సందర్భంగా యాజమాన్యాని డిమాండ్ చేసినారు. ఈ సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిలాలి అని, పోరాడుదాం కరువు భత్యం తో కూడిన 50 శాతం పెన్షన్ పెంపుదల కోసం పోరాడుదాం , ఈ నెల 30 న న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగే బొగ్గు పెన్షన్ దారుల ధర్నా ను జయప్రదం చేద్దాం ✊🏻ఈ సమావేశం లో గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న , అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ గంగయ్య, కార్యదర్శి ఎన్ అంజయ్య , నాయకులు ఆర్ రమేష్ లాల్ , మురహరి , రమేష్ , సూర్యం , కె శంకర్ , ఎం రాజమల్లు , పులి కృష్ణ , ఏ ప్రభాకర్ , ముత్తె భానయ్య , దుర్గం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారూ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News