నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల కు చెందిన జర్నలిస్ట్ నకిరేకంటి గోపి విజయ ల కుమార్తె శివాని ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో…మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను చాటారు. ఎంపిసి విభాగంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. శివాని ప్రస్తుతం నల్లగొండలోని గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి |సంవత్సరం చదువుతోంది. పదో తరగతి వరకు దామరచర్ల లోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివింది.గత పది పరీక్షలలో కూడా శివాని 550 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచారు. ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించిన శివాని ని కాలేజీ యాజమాన్యం, కుటుంభక సభ్యులతోపాటు జర్నలిస్టులు అభినందించారు. భవి ష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.





