Tuesday, April 14, 2026

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రూపనార్ రమేష్

నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ (ఎండి ముబీన్)జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూపనార్ రమేష్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రైతు అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్ గారు, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ డివిజన్ యువజన సంఘం అధ్యక్షులు బొట్టుపల్లి ప్రశాంత్, అఖిలభారత మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగోసే శంకర్ గారు, ఆసిఫాబాద్ ఆత్మ కమిటీ డైరెక్టర్ ఇగూరపు సంతోష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News