నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 14 (రిపోర్టర్ ఇమామ్ సాబ్),నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో టాస్క్ ఫోర్స్ మరియు రూరల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి దామరగిద్దకు చెందిన సబేరా బేగం ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10.5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి డిటి పంచనామా నిర్వహించి, సబేరా బేగం పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని రూరల్ ఎస్ఐ సతీష్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ రెడ్డి మాట్లాడుతూ…ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేసే పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచడం, రవాణా చేయడం లేదా ఇతరులకు విక్రయించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు ఇలాంటి అక్రమాల గురించి సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఎస్ఐ తెలిపారు.





