నేటి సాక్షి, సూర్యాపేటసూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం రాజకీయంగా, సామాజికంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ సభలో కులగణన అంశంపై బలమైన సందేశం వినిపించింది.దేశవ్యాప్తంగా కులగణన అంశాన్ని చర్చలోకి తీసుకువచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఘనంగా సత్కారం నిర్వహించారు. అభిమానంతో ఆయన ఫోటోకు పాలాభిషేకం చేస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. మల్లన్నపై ఉన్న ప్రజాభిమానానికి ఇది నిదర్శనంగా నిలిచింది.ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ —“సమాజంలో నిజమైన సమానత్వం సాధించాలంటే కులగణన తప్పనిసరి. వెనుకబడిన వర్గాల అసలు స్థితి బయటపడాలంటే ఈ ప్రక్రియ అత్యవసరం” అని స్పష్టం చేశారు. కులగణన ఆధారంగా ప్రభుత్వ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరుతాయని, సామాజిక న్యాయం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.అలాగే తీన్మార్ మల్లన్న పోరాటం వల్లే కులగణన అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని కొనియాడారు. ఆయన నాయకత్వం సామాజిక న్యాయ సాధనలో కీలక మలుపు తిప్పిందని అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో TRP మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నే మంజుల గౌడ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు చాంద్ పాషా, టౌన్ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఉపాధ్యక్షురాలు వర్రె కవిత, ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్, ఆత్మకూరు (ఎస్) మండలాధ్యక్షుడు బొల్లె సైదులు, పెన్పహాడ్ మండలాధ్యక్షుడు ఆవుల అంజయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





