Friday, April 17, 2026

హెడ్లైన్ : అగ్ని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండ

నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 17 పెద్దకడబూరు మండలం లక్ష్మీపేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధమై చిన్న ఆంజనేయ కుటుంబం నిరాశ్రయులుగా మారింది. ఈ ఘటనపై మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వెంటనే స్పందించి బాధితులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి, శివారెడ్డి, విజేంద్ర రెడ్డి బాధిత కుటుంబాన్ని కలిసి శుక్రవారం ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనుకోని ప్రమాదంతో ఇల్లు కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవడం అవసరమని నాయకులు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News