నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 17 పెద్దకడబూరు మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధమై నిరాశ్రయులైన జల్లి చిన్న ఆంజనేయ కుటుంబానికి మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేందర్ రెడ్డి అండగా నిలిచారు. ప్రమాదంతో అన్నీ కోల్పోయిన కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన ఆయన, వారి పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయం అందజేయడంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇలాంటి కష్టకాలంలో తమకు ఎప్పుడూ అండగా ఉంటామని, కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టమని భరోసా ఇచ్చారు. బాధితులు తిరిగి సాధారణ జీవితం ప్రారంభించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సహాయక కార్యక్రమంలో మంచాల సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి, టీడీపీ యువనాయకులు ఎన్. రాకేష్ రెడ్డి ముందుండి సేవలందించారు. అలాగే మండల జనరల్ సెక్రటరీ ఎం. రామాంజనేయులు, పెద్దకడబూరు సొసైటీ చైర్మన్ టి. ఆంజనేయులు, రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు మల్లికార్జున, యూనిట్ ఇంచార్జ్ తలారి అంజి, డీలర్ ఈరన్న, టి. లక్ష్మన్న, యువరాజ్, టి. ఈరన్న, ఓబులేసు, చిన్న హనుమన్న, కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.అనుకోని ప్రమాదంతో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి నాయకులు తక్షణ సహాయం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటారని స్థానికులు అభినందించారు.





