Tuesday, April 21, 2026

ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ముట్టడి..పి ఆర్ టి యు మహా ధర్నా..

నేటి సాక్షి 21 నంద్యాల జిల్లా:-ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సంఘం పిలుపు మేరకు ఈ రోజు 21-04-2026 న నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద, పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి ల అధ్యర్యంలో మహా ధర్నాను చేపట్టారు.వెయ్యి మంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ…ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.అధికారంలో వచ్చాక ఉద్యోగ , ఉపాధ్యాయులకు మెరుగైన పి ఆర్ సి ఐ ఆర్ పెండింగ్ డి ఎ లు వంటి అంశాలపై హామీ ఇచ్చిన ఇంత వరకు నెరవేర్చకపోవడం శోచనీయం అని వెంటేనే పి అర్ సి కమిషన్ ఏర్పాటు చేసి, 30% IR చెల్లిస్తూ పెండింగ్ DA లు విడుదల చేయాలని కోరారు.పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పాలకుల నిర్లక్ష్యం ఉద్యోగ, ఉపాధ్యాయుల పై అలాగే కొనసాగుతుందని, దీనిని అడ్డుకుంటామని, సిపిఎస్ రద్దు చేయాలని, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ వర్తింపు చేయాలి, మెమో 57 అమలు పరచాలని, 2022 నుంచి పెండింగ్ లో వున్న సరెండర్ లీవ్ చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు..జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి మాట్లాడుతూ అనేక ఆశలతో ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 2 సంవత్సరాలైన మన ప్రధాన డిమాండ్లను పెండింగ్ లో పెట్టడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా ఉందని, ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు అన్ని చెల్లించాలని, రిటైర్ అవుతున్న ఉపాధ్యాయులకు వారి పదవీ విరమణ రోజే వారి చెందాల్సిన ప్రయోజనాలు చెల్లించాలని, ఎం టి ఎస్ ఉపాధ్యాయులైన డీఎస్సీ 1998,2008 వారిని రెగ్యులర్ చేయాలి , వారికి 12నెలల జీతం చెల్లించాలి అని కోరారు.అలాగే ఎయిడెడ్, మున్సిపల్, మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ, కేజీబీవీ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి అని కోరారు…చాలా పెద్ద ఎత్తున ఎండ వేడి లెక్క చేయకుండా ఉపాధ్యాయులు నిరసన గళం ఎత్తారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 25 తేదీన చలో విజయవాడ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ భార్గవ రామయ్య,రాష్ట్ర నాయకులు కె కృష్ణారావు, గోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయ్ రావు, ఇబ్రహీం, రాంపుల్ల రెడ్డి, మధుసూదన్, వై.వి.రమణయ్య, పి నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, హనుమంతు, రవీంద్ర రెడ్డి, జాకీర్ కె శ్రీనివాసులు , S.M బాషా, జేసీ నరసింహులు, సుమియన్, జగదీశ్ బాబు, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులుమహిళా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News