నేటి సాక్షి, ఎండపల్లి: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ యువ నాయకులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కప్పరావుపేటకు చెందిన యువ నాయకుడు బత్తిని భరత్ సబ్బుపై కొప్పుల ఈశ్వర్ ప్రతిమను ఆకృతిగా చెక్కించి ప్రత్యేక బహుమతిగా అందజేశారు. యువతలో ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటేలా ఈ వినూత్న కానుక నిలిచింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ ప్రజలకు చేసిన సేవలు, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ నాయకులు దేవి నళిని కాంత్, తరాళ్ల కార్తీక్ తదితరులు పాల్గొని శాలువాతో కొప్పుల ఈశ్వర్‌ను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు





