నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్(ఎండి ముబీన్)ఆసిఫాబాద్: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ డిమాండ్ చేశారు.బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కార్మికులు చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని వారు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, సలం బీన్ అహ్మద్, మాజీ ఏఎంసీ సింగిల్ విండో చైర్మన్ గంధం శ్రీనివాస్, అలీ బీన్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ నీసార్, దూడల అశోక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్నప్పటికీ వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, వారు చేపడుతున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.





