Wednesday, April 22, 2026

*ఘనంగా గ్రాడ్యుయేషన్ డే*

*నేటిసాక్షి, నల్లబెల్లి* మండలంలోని రంగాపురం ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డేను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి అనురాధ పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నాణ్యత గల గుణాత్మక విద్య, సామర్ధ్యాల వారి బోధన కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే లభిస్తుందని అనుభవం గల ఉపాధ్యాయులు పటిష్టమైన పర్యవేక్షణ గల మేనేజ్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉంతుందన్నారు.ప్రైవేట్ సెక్టార్ లో నిర్వహించే గ్రాడ్యుయేషన్ డే ను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించడం ఆనంద దాయకమని విద్యార్థులలో నేర్చుకోవాలని కుతూహలంను పెంపొందిస్తుందని ఉన్నత చదువులకు రాచబాటగా నిలుస్తుందన్నారు.గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు మాజీ సర్పంచ్ చీకటి ప్రకాష్ మాట్లాడుతూ… రంగాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచేందుకు ఉపాధ్యాయులకు తమవంతు సహకారం అందిస్తామని ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు నేర్చుకోవాలని ఆలోచన ప్రేరణ కలిగి వారు జీవితంలో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ప్రభుత్వ పాఠశాలలు దారి చూపిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, స్వరాజ్యం, చందన, సహారా,విద్యావంతుల వేదిక అధ్యక్షులు పట్టు సాంబయ్య, గ్రామ వార్డు సభ్యులు శ్రీహరి, సతీష్, సిఆర్పి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News