Wednesday, April 22, 2026

*ప్రధాని మోడీపై చేసిన అనుచిత వాఖ్యలపై ఖండన**భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు*——————————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………..తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఐ సి సి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఉగ్రవాదిగా, దక్షిణాది రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నాడని పేర్కొనటాన్ని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు తీవ్రంగా ఖండించారు. బుధవారం రాజు జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ సబ్ కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే పాలన విధానంతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ఈ విధంగా పేర్కొనటం సరికాదని,ఇది మోడీని మాత్రమే అవమానించడం కాదని 140 కోట్ల మంది భారతీయులను అవమానించడమేనని పేర్కొన్నారు.ఉగ్రవాదులకు, దేశద్రోహులకు ఊతమిచ్చే ఈ కాంగ్రెస్, దాని అధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోడీకి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం, కార్యదర్శి సింగం గంగాధర్, ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు, చెట్ల గంగాధర్,నరేందుల శ్రీనివాస్, వేముల దేవ రాజం,ఎడమల వెంకట్ రెడ్డి, బొందుకూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News