నేటిసాక్షి, మిర్యాలగూడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటుకు బిసి బిడ్డలు సిద్ధంగా ఉండాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. పట్టణంలోని బీసీ భవన్ లో, బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ, బీసీలను ప్రభుత్వాలు ఓటు బ్యాంకు గానే చూస్తున్నాయి తప్ప, బీసీలకు దక్కవలసినటువంటి ఏ ఒక్క హామీలు రాజకీయ పదవులు, రిజర్వేషన్ లు, విద్యార్థుల స్కాలర్షిప్స్ నామినేట్ పదవుల్లో బీసీలకు అన్యాయం, సర్పంచ్, కౌన్సిలర్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేస్తూ, ఎన్నికల సమయంలో మాత్రం బీసీలపై కపట ప్రేమ దొంగ హామీలు ఇచ్చి గద్దెని ఎక్కుతున్న పార్టీలకు వ్యతిరేకంగా బీసీలందరూ ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, బీసీ యువజన సంఘం పట్టణ నాయకులు రమేష్ యాదవ్, ఉదయ్, నవీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.





