నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఏప్రిల్ 24 గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో,స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను స్వయం సమృద్ధిగా మార్చడంలో పంచాయతీరాజ్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.మండలంలోని ఆమెని గుంట స్వర్ణ గ్రామం నందు ప్రత్యేక అధికారి బి ఎంపీడీవో గఫూర్ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది గ్రామ స్వరాజ్యం పాలకుల పాత్ర పంచాయతీ రాజు చట్టంలో గల పలు అంశాలను తెలియజేశారు అనంతరం మండలంలోని స్వర్ణ గ్రామ నందు గ్రామసభలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంత ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు





