నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………….. జగిత్యాలలో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరం.ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. శంకర్ గౌడ్ మృతి బాధాకరమని, కుటుంబానికి రూ.కోటి రూపాయల పరిహారం,ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని బలోపాతం చేసి ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించాలని కోరారు.





