Monday, April 27, 2026

ఉద్యమపార్టీకే మళ్ళీ అధికారం..రాజిరెడ్డి

నేటి సాక్షి, దోమ (సురేష్ మోత్కూర్.) తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి కొట్లాడిన ఉద్యమకారులకే మళ్ళీ అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దోమ మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు కే రాజిరెడ్డి అన్నారు తెలంగాణ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా దోమ మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్,మాజీ మండల ప్రజాప్రతినిధులు లక్ష్మయ్య, రాజగోపాల్ చారి,ఖాజాపాషా తదితరులతో కలిసి తెలంగాణ ప్రత్యేకత గురుంచి పలువురు నేతలు తెలిపారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారని, మరో రెండేళ్ల తరువాత వచ్చే ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ కెసిఆర్ నెత్రుత్వం లో మళ్ళీ రాస్రంలో బీఆరెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది అని రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా స్వీట్లు పంపిణి జరిగింది పంచాయతీ సభ్యులు మాజీ సభ్యులు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News