నేటి సాక్షి నారాయణపేట ఏప్రిల్ 27, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద జి ఎన్ జి జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్లు సాయికిరణ్ ఎండి జనరల్ మెడిసిన్, మణిచంద్ర జనరల్ సర్జన్, డాక్టర్ ఎం విజయ్ కుమార్ గౌడ్ ఎంఏ, జనరల్ సర్జన్, డాక్టర్ జి బీమ్ రాజ్ బి ఎ ఎం ఎస్ జనరల్ ఫిజిషియన్ల ఆధ్వర్యంలో రోగులను వైద్య సేవలు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం జి ఎన్ జి మెడికల్ జనరల్ స్టోర్ నిర్వాహకులు గోవర్ధన్ గౌడ్ నవ్యశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న రాజకీయ నాయకులకు గ్రామ సర్పంచి తో పాటు డాక్టర్లకు కూడా శాలువాతో జిఎన్జి మెడికల్ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య, నాయకులు రామ కృష్ణ, పెంట మీద రాఘవేంద్ర, గొల్ల రాజు, గోవర్ధన్, టైసన్ రాఘవేంద్ర,రవి, రామకృష్ణారెడ్డి, అల్లా బకస్ తదితరులు పాల్గొన్నారు.





