Saturday, May 2, 2026

*జగిత్యాల పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జగిత్యాల నియోజకవర్గ స్థాయి సమావేశం*——————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని విరుపాక్షి గార్డెన్స్‌లో నిర్వహించిన జగిత్యాల నియోజకవర్గ స్థాయి సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు.*ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ* ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, యువత క్రీడలు, విద్యుత్, పిల్లల భద్రత తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, వారికి మద్దతుగా అధికారులు, ప్రజలు పనిచేయాలని సూచించారు.డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ టీమ్ సమర్థంగా పనిచేస్తోందని పేర్కొంటూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని అన్నారు.గ్రామాల్లో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి పార్కుల పరిశుభ్రత, పచ్చదనం పెంపుపై సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. డ్రైనేజీ నిర్మాణాలతో పాటు ఇంకుడు గుంతల ఏర్పాటు చేపట్టి, మురుగు నీరు చెరువుల్లో కలవకుండా చూడాలని ఆదేశించారు.తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలను చైతన్యపరచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకపోతే డంపింగ్ యార్డులు సరిపోవని హెచ్చరించారు.గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. జగిత్యాల నియోజకవర్గంలో సుమారు 78 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు.సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి పలు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు.“రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ అధికారులు, ఎంపీడీవోలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కార్యక్రమ షెడ్యూల్‌ను ముందుగానే తెలియజేయాలని సూచించారు.*ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ మాట్లాడుతూ*ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత కాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందే సేవల్లో పారదర్శకత, నాణ్యత ఉండేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కె. రాజ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లు, ఎంపిడివోలు, మండల స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు,కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News