Monday, May 4, 2026

*జర్నలిస్ట్ ల రక్షణ కై ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు డిమాండ్*.

నేటి సాక్షి 04 మే జూపాడుబంగ్లా:-. రాష్ట్రం లో జర్నలిస్ట్ ల పై జరుగుచున్న దాడులని అరికట్టడం లో ప్రభుత్వం విఫలం చెందుతుందని వారి జరుగుచున్న దాడులను అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు ఓక ప్రకటన లో డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయం లో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతునిన్నటి రోజున అనంతపురం లో మనం దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అనంతపురంలోని శ్రీ గీతం జూనియర్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాల ఫై గత రెండు రోజులుగా వార్తా కథనాలు వ్రాశాడనీ,దీనిని జీర్ణించుకోలేని యాజమాన్యం వారి గుండాలతో శనివారం అనంతపురంలోని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేసి కాళ్లు మొక్కించుకోవడం జరిగింది చాలా దారుణమైన ఘటన ఈ సంఘటన పై విచారణ చేసి బాద్యులని శిక్సించాలన్నారు. నెలలో రెండు మూడు ఘటనలు ఇలాగే జరుగుచున్నాయని, ప్రజలకు ప్రభుత్వానికి వారధి గా ఉన్న జర్నలిస్ట్ లపై దాడులు చేయడం హే్యమైన చర్య అన్నారు.బవిష్యత్ లో ఇలాంటి సంఘటన లు పునరావుతాం కాకుండా చర్యలు తీసుకోవాలని రక్షణ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. వారి పై జరుగుచున్న దాడుల కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అండగా ఉంటామన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News